పీఆర్సీ విషయంలో సందిగ్దత తొలగించేందుకు రెడీ అవుతున్నారు. అటు మంత్రుల కమిటీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటు స్టీరింగ్ కమిటీ కూడా పట్టువిడుపులకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయి. కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. సమ్మె నోటీసులో ఇచ్చిన అన్ని అంశాలపై ఉద్యోగులు…
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న…