Man Assaulted Minor Girl With Help Of Married Woman In Prakasam District: ప్రకాశం జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికకు మత్తు మందిచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. షాక్‌కి గురి చేసే మరో విషయం ఏమిటంటే.. ఈ దారుణంలో అతనికి ఓ మహిళ సహకారం అందించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఓ బాలికపై కన్నేసిన ఆగంతకుడు, ఆమెను అనుభవించాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తనకు పరిచయం ఉన్న వివాహితకు తెలియజేశాడు. దీంతో.. అతనికి సహకరించేందుకు ఆమె ఒప్పుకుంది.
Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. స్టాక్‌హోమ్‌లో అత్యవసర ల్యాండింగ్..
మాయమాటలు చెప్పి బాలికని తీసుకొచ్చింది. మత్తు మందు కలిపిచ్చి.. ఆపై ఆ ఆగంతకుడు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం చెట్ల పొదల్లో పడేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలికను గుర్తించిన స్థానికులు.. ఆమె పరిస్థితిని చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ పని ఎవరు చేశారని ప్రశ్నించగా.. నిందితుడు, వివాహిత గురించి చెప్పింది. దీంతో.. తల్లిదండ్రులు, బంధువులు కలిసి నిందితుడ్ని, అతనికి సహకరించిన మహిళను పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత వాళ్లను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Constable Robbery: కానిస్టేబుల్ చేతివాటం.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు