ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన సగం కాలిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. తోటి స్నేహితుడే, ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అసలు హత్య ఎందుకు చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఈ నెల 3న దారుణ హత్య జరిగింది. క్రీడా మైదానం వద్ద సరిగా పాతికేళ్లు కూడా నిండని యువకుడి మృతదేహం…
Tragedy In Prakasam: కన్నతండ్రి అంటే.. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఆ పిల్లల పాలిట వాళ్ల తండ్రే కాలయముడయ్యాడు. అత్యంత దారుణంగా వారిని చంపేసి..పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలను చంపేసి.. తండ్రి చనిపోయిన ఘటన.. ప్రకాశం జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలకలం సృష్టించింది. అతని పేరు గుత్తా వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లి స్వస్థలం. అక్కడే ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నాడు.…
డబ్బు.. మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. పైసల కోసం సొంత వ్యక్తులను కూడా కడతేర్చుతున్నారు. గతంలో రైతుబీమా డబ్బు కోసం కన్న తల్లిని కొడుకు కడతేర్చిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే చంపేశాడు. యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేసి.. పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ ఘటన గతేడాది ఫిబ్రవరిలో జరగ్గా.. చాలా ఆలస్యంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే……