Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు..
- వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు పేరుతో వేడుకగా కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veligonda Project: మార్కాపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు.
సీఎం చంద్రబాబు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు సీఎం చంద్రబాబు రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ముఖ్యమంత్రి ప్రారంభించడంతో పాటు ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
Also Read
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
అనంతరం వెలిగొండ ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి కృష్ణా జలాలను వెలిగొండకు విడుదల చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. గంటవానిపల్లిలో నిర్వహించే ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే సాగు, తాగునీటి ప్రయోజనాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం మాట్లాడనున్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు తిరుగు ప్రయాణం ప్రారంభించి.. మధ్యాహ్నం 2.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!