A Police Constable Caught On Camera Doing Robbery In TDP Office: ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్.. ఘర్షణ జరుగుతున్న చోట విధుల్లో ఉన్నారు.. అక్కడ పరిస్థితుల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఆయనది. కానీ.. అందుకు భిన్నంగా ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించడం దుమారం రేపుతోంది. ఆ ప్రాంతంలో ఓ వైపు ఘర్షణ కొనసాగుతుంటే.. మరోవైపు ఈ కానిస్టేబుల్ డబ్బులు దోచుకోవడంలో బిజీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Rashmika: టాప్ ట్రెండింగ్ లో రష్మిక పేరు… కారణం ఆ మూడు
గన్నవరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడులు నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి పోలీసుల వచ్చి, బందోబస్తు నిర్వహించారు. ఓవైపు వైసీపీ వర్గాలు టీడీపీ ఆఫీస్‌ని ధ్వంసం చేస్తుంటే, మరోవైపు ఓ కానిస్టేబుల్ అదును చూసి ఆ ఆఫీస్‌లో డబ్బులు దోచుకున్నాడు. కార్యాలయం టేబుల్ సొరుగులో ఉన్న ఓ సెల్‌ఫోన్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ లాంటి బాక్సును తీసుకుని అటుఇటూ చూస్తూ.. ఫ్యాంటు జేబులో వేసుకున్నాడు. ఇదంతా సీసీకెమెరాలో రికార్డైంది. ఇంతలోనే అక్కడికి కొందరు రావడం చూసి.. ఒక్కసారిగా కంగారుపడ్డాడు. తాను దొంగతనం చేయలేదన్నట్టుగా.. ఏదో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లాడు.
Nude photo: మహబూబ్ నగర్ లో న్యూడ్ ఫోటోల కలకలం.. తాంత్రిక పూజలతో లైంగిక దాడి
ఆ కానిస్టేబుల్ బాగోతం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని చూసి.. సదరు కానిస్టేబుల్, పోలీస్ విభాగంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో.. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆ కానిస్టేబులో ఎవరో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.