Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో తనపై మరో కేసు నమోదైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. జనవరి 31వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారనే ఆరోపణలతో పోలీసులు తాజాగా తనకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఒకే నేరంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పినప్పటికీ, తనపై ఇలాంటి కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు. “ఇలా కేసులు పెట్టడానికి వాళ్లకైనా సిగ్గుండాలి, నాకైనా ఉండాలి” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే అంశానికి సంబంధించి తనను 18 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచారని, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై తాను ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పానని ఆయన గుర్తుచేశారు.
Also Read
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక నారా లోకేష్ హస్తం ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేష్ డైరెక్షన్లోనే ఈ నాటకాలన్నీ నడుస్తున్నాయని విమర్శించారు. ఎస్సైలకు నేరుగా ఫోన్లు చేయించడం, తనకు నోటీసులు ఇప్పించడం వంటి పనులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను జీవితంలో ఎప్పుడూ జైలుకు వెళ్లడానికే భయపడలేదని, ఇక ఈ పోలీసు నోటీసులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజా ఉద్యమాలను, తమ గొంతును అణచివేయాలని చూస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ అక్రమ కేసులన్నీ భవిష్యత్తులో ప్రభుత్వానికే భస్మాసుర హస్తంలా మారుతాయని అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!