Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదకర లిఫ్ట్ ప్రమాదం
- మార్కెట్ సెంటర్లోని సాయి సూర్య అపార్ట్మెంట్లో ఘటన
- లిఫ్ట్ ప్రమాదంలో 50 ఏళ్ల వనిత మృతి
- కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్‌లో ఉన్న వనిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ సెంటర్లోని సాయి సూర్య అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదానికి గురై 50 ఏళ్ల మహిళ మృతి చెందారు. మృతురాలిని వనితగా గుర్తించారు. లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ఫ్లోర్‌కు, లిఫ్ట్‌కు మధ్యలో ఇరుక్కుపోయారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. వనిత తన కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్‌లో ఉన్నారు. కుమార్తె, మనవడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. వారి వెంటే వనిత కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దీంతో వనిత లిఫ్ట్‌కు, ఫ్లోర్‌కు మధ్యలో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వనిత పరిస్థితి విషమించింది. అనంతరం ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అపార్ట్మెంట్ లిఫ్ట్‌ల భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్న సమయంలో కిందికి పడిపోవడంతో ఎందుకు కిందికి కదిలిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Woman Dies After Getting Trapped in Lift
Andhra Pradesh A 50-year-old woman, Vineetha, died after getting trapped between the floor and a lift Sai Surya Apartments in Ongole The lift reportedly moved down suddenly before the gates closed. She later died while undergoing treatment pic.twitter.com/nDsR49SOeJ— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 19, 2026
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!