కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.. బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉంటాం.. బెల్టుషాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.. అయితే, ప్రకాశంజిల్లాలో బెల్టుషాపు కారణంగా టీడీపీలోని రెండు గ్రూపులు పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు చేసుకొని తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు..