Post Master Fraud: పోస్టుమాస్టర్ నిర్వాకం.. పొదుపు డబ్బులతో పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనం సొమ్ముకు గాలం వేశాడు… పోస్టాఫీసుకు తాళం వేశాడు. పోస్టుమాస్టర్ నిర్వాకంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని బీదజనం. ఆరుగాలం కష్టించి తమ భవిష్యత్ అవసరాలకోసం కొంచెం కొంచెం సొమ్ము పొదుపుచేసుకున్నారు. ఆ సొమ్మును సాంతం తీసుకొని పరారయ్యాడు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే ఉన్నతమైన సంస్దలో కూడా తమ సొమ్ముకు భరోసా లేకపోవడంతో బాధితుల వేదన వర్ణనాతీతం.
తాళ్లరేవు మండల పరిధిలోని కేశవపురం పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమాస్టర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము పోస్టాఫీసులో దాచుకున్నారు. పోస్టుమాస్టర్ డబ్బుతో పరారు అయ్యాడని తెలియడంతో వారికి కంటిమీద కునుకులేకుండా పోయింది. మండల కేంద్రమైన తాళ్లరేవు పంచాయతీలోగల కేశవపురం పోస్టాఫీసులో సుమారు 600 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఎస్బీ అకౌంట్ లతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు, ఆర్పీఎల్బీ, సుకన్య తదితర పథకాల ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. ఈ శాఖ తాళ్లరేవు సబో పోస్టాఫీసుకు అనుబంధంగా పనిచేస్తుంటుంది. అయితే ఇక్కడ పోస్టుమాస్టర్ పనిచేస్తున్న సీహెచ్ సుబ్రహ్మణ్యం ఈ నెల 5వ తేదీ నుంచి కార్యాలయానికి రాకపోవడం, తాళాలు వేసి ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
TCongress : రేవంత్ రెడ్డి Vs కోమటిరెడ్డి..కాంగ్రెస్‌లో చేరికల జగడం @జడ్చర్ల
Also Read
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ఈ నేపథ్యంలో కాకినాడ సౌత్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎస్.సూర్యప్రకాష్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుబ్రహ్మణ్యం చేసిన పలు అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ ఓచర్లతోపాటు తెల్ల కాగితంపై చేతితో రాసిన బిల్లులు ఉండడాన్ని గుర్తించారు. నా భర్త గత ఏడాది కోవిడ్‌లో చనిపోయారు విద్యార్థులంతా తలో చెయ్యివేసి సుమారు రూ.80 వేలు సేకరించి ఇవ్వగా పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేశాం అంటూ ఒక మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీసు ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులకు న్యాయంచేయాలని, తమ సొమ్ముకు భరోసా కల్పించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
పోస్టాఫీసులో గోల్డ్ లోన్ సౌకర్యం లేదు. అయితే పరారైన పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యం గోల్డ్ లోన్లు కూడా ఇచ్చి జనాలను మోసగించిన వైనం బయట పడింది. స్థానిక రత్సవారిపేట గ్రామానికి చెందిన బొక్కా వెంకటలక్ష్మి నుంచి 24 గ్రాముల బరువైన చైను, సూత్రాలను తాకట్టు పెట్టుకుని రూ.65 వేలు మంజూరు చేశాడు. అదికూడా కేవలం ఒక తెల్ల కాగితంపై రాసి సంతకం పెట్టి, పోస్టాఫీసుకు సంబంధంలేని తన సొంత స్టాంపువేసి ఇచ్చాడు. నా నగల విలువ సుమారు రూ.1,20,000 ఉంటుందని, ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.అంతే కాకుండా అమ్మవడి, తదితర ఇతర ప్రభుత్వ పధకాల సొమ్మును కూడా తన సొంతానికి వాడుకుని పరారైనట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BJP : ఓరుగల్లులో ఆపరేషన్ ఆకర్ష్ జోరు..TRS, BJP రకరకాల వ్యూహాలు
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!