ఢిల్లోలో ఆయన ఫొటోతో పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆగష్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి జరుపుకుంటున్నామని అన్నారు. పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రు వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తామని అన్నారు. ఢిల్లి, కోల్ కత్తాలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని అన్నారు. వెంకయ్య రూపొందించిన నిజమైన జెండాను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. మువ్వన్నెల జెండా చూస్తే జాతీయత ఉప్పొంగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆగష్టు13-15వరకు దేశంలో ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా రెపరెపలాడాలని తెలిపారు. ప్రధాని కూడా అన్ని రాష్ట్రాల సీఎంలతో దీనిపై మాట్లాడారని గుర్తుచేసారు. హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమం చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా ఇళ్ల పై జెండాను ఎగురేయాలని అన్నారు. భారతీయులు దేశ భక్తికి చిహ్నంగా అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు.
read also: Kishan Reddy: లంబసింగిలో రూ. 35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం
ఆగష్టు 2నే పింగళి జయంతి సభ వేదిక మీద నుంచే ఒక పాట విడుదల చేస్తున్నామని స్పష్టం చేసారు. ప్రధాని, అమిత్ షా లు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానిస్తారని అన్నారు. ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ నుంచి పార్లమెంటు విజయ చౌక్ వరకు ఆగష్టు3న యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు అంతా మోటార్ సైకిల్ పై తిరంగా యాత్రలో పాల్గొంటారని అన్నారు. ఆగష్టు14న మన దేశాన్ని విభజించిన రోజని, గాంధీ ఆలోచన విధానానికి విరుద్ధంగా భారతదేశాన్ని చీల్చారని మండిపడ్డారు. పాకిస్తాన్, హిందూస్థాన్ గా విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మతం పేరుతో పది వేల మందిని ఆరోజు ఊచకోత కోసి చంపారని మండిపడ్డారు. ఆ రోజును పాకిస్తాన్ విభజన్ కా విదుష్ కా స్మృతి దివస్ పేరుతో కార్యక్రమం చేపడతామన్నారు. ఆరోజు చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటించి గుర్తు చేసుకుంటామన్నారు.
read also: Earthquake: నేపాల్ లో భూకంపం.. 6.0 తీవ్రతతో కంపించిన భూమి
ఆరోజు పారిపోయి వచ్చిన వారిని సభకు తీసుకువస్తామన్నారు. ఆగష్టు14 రాత్రి అందరూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. యువకులు ఎక్కడికక్కడ మోటారు సైకిళ్ల యాత్రను నిర్వహించాలని అన్నారు. ఆగష్టు 9 తరువాత ఎప్పుడు వీలైతే అప్పుడు ర్యాలీలు చేపట్టాలని అన్నారు. మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించాలని పిలుపునిచ్చారు. ఆగష్టు15న పూలమాలలు వేసి ఘనంగా నివాళలు అర్పించాలని, ప్రతి భారతీయుడూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఎవరికి వారు జెండాను కొనుక్కుని ఎగుర వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని ఫోస్టాఫీసులలో జెండాలను అందుబాటులొ ఉంచుతామన్నారు. జెండాల తయారీ పై తయారీదార్లకు కూడ లేఖలు రాశామన్నారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసి ప్రధాని తరపున ఆహ్వానం అందిస్తామని అన్నారు. అన్ని ఖాదీ పరిశ్రమలకు కూడా ఆర్డర్లు ఇచ్చామన్నారు. అయితే ఖాదీ ద్వారా అన్ని జెండాలు తయారీ సాధ్యం కాదని పేర్కొన్నారు. వెంకయ్యకి భారతరత్న అంశంపై చర్చ జరగలేదని గుర్తు చేసారు. దీని పై కూడా కమిటీలో చర్చిస్తామన్నారు.
Director Lakshmikanth Chenna: నన్ను క్షమించండి.. దయచేసి ఆవీడియోను డిలీట్ చేయండి