తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కమిట్‌మెంట్ ఈ సినిమా ప్రోమో ఇటీవల విడుదలైంది. కాని దానికి సంబంధించిన ఓసీన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆసీన్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. దానికి నేపథ్య సంగీతంగా భగవద్గీతలో శ్లోకం ఉపయోగించడం వివాదాస్పదం అయ్యింది. అయితే..కమిట్‌మెంట్ కాంట్రావర్సీ నేపథ్యంలో దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా స్పందించారు. ఈనేపథ్యంలో.. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాము ఉద్దేశపూర్వకంగా.. కావాలని విడుదల చేసిన వీడియో కాదని వివరించారు.
read also:Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ నిరసనలు..
కమిట్ మెంట్ మూవీ డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్న క్షమించండంటూ కోరారు. రీసెంట్ గా మా సినిమా ప్రోమో లో భగవత్ గీత వాడడం వెనుక నేను సెన్సేషన్ కోసమో వ్యూస్ కోసమో కాదని స్పష్టం చేసారు. తను కానీ.. మా టీమ్ కానీ.. నిర్మాతలు కానీ.. ఆవీడియో రిలీజ్ చెయ్యలేదని పేర్కొన్నారు. నా కథ తాలూకా ఆత్మ ఆ శ్లోకం లో ప్రతిబింబిస్తుంది అని, నాకు నేను ప్రోమో చేసుకొని , మా టీమ్ సభ్యులకు పంపించానని తెలిపారు. వాళ్ళు ఎగ్జైట్ అయ్యి వాళ్లకు వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల ఆ వీడియో వైరల్ అయ్యిందని చెప్పుకొచ్చారు. హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు నన్ను క్షమించండంటూ ఆయన కోరారు. హిందూ మతం నాకు తల్లి వంటిది హిందూ మతాన్ని కించపరిస్తే నా తల్లిని కించ పరుచు కున్నట్టే అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయచేసి ఆ వీడియో వున్న వాళ్ళందరూ డెలీట్ చెయ్యండి ఇది నా రిక్వెస్ట్ అంటూ కమిట్ మెంట్ మూవీ డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్న కోరారు.
అయితే.. కమిట్‌మెంట్ ట్రైలర్ అంతా లిప్ లాక్స్, రొమాన్స్‌తో నింపేసి, చివర్లో మురికి చేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో.. అట్లు కామం చేత జ్ఞానము కప్పబడి యున్నది అంటూ భగవద్గీతలో ప్రవచనం వినిపించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా హిందువుల మనోభావాలు కించపరచడం తగదని చెబుతున్న క్రమంలో దర్శకుడు క్షమాపణలు కోరారు.
Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం