రూ. 35 కోట్లతో లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు వీర మరణం పొందిన స్థలం, నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అల్లూరి, ఘంటసాల, నన్నయ్య వంటి వారి గురించి ప్రధానికి వివరించామని స్పష్టం చేసారు. వాళ్ల గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకునే విధంగా కేంద్రం ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్పష్టం చేసారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, బలి దానాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారని వివరించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. దేశాభివృద్ధికి కష్టపడి పని చేశారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఈయేడాది ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాటి త్యాగధనుల గురించి నేటి తరం తెలుసుకునేలా భారత ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.
read also: హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే..
ప్రధాని అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 250 మంది ఉన్న ఈ కమిటీలో రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని అన్నారు. సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు చూసే బాధ్యత నాకు అప్పగించారని అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో భాగమై పని చేస్తున్నాయని అన్నారు. ఆగష్టు 15, 2023 వరకు ఈ ఆజాది కా అమృత్ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కేంద్ర మంత్రి అన్నారు. 2047కి స్వాతంత్ర్య సాధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటామని హర్షం వ్యక్తం చేసారు. ఈ పాతికేళ్లు మన దేశానికి బంగారు ఘడియలని కేంద్ర మంత్రి కిషన్ తెలిపారు. రాజకీయాలకతీతంగా మన దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఇందులో యువత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాని, వచ్చే 25 సంవత్సరాల తరువాత యూత్ పాపులేషన్ మనకు తగ్గుతుందని, అందరం ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ప్రధాని, కమిటీ సభ్యులు కూడా ఈ అంశాలపై చర్చ చేసి కార్యాచరణ రూపొందిస్తారని కిషన్ రెడ్డి అన్నారు.
Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!