Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- పెదపెంకి సమస్యపై పవన్ సమీక్ష
- 197 బోదకాలు కేసులతో గ్రామంలో కలకలం
- రూ.6.18 కోట్లతో డ్రెయిన్లు, రోడ్లు
- త్వరలో గ్రామంలో పవన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లా, పెదపెంకి గ్రామ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా ఆ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న బోదకాలు (ఫైలేరియా) వ్యాధి సమస్యకు సమష్టి కృషితో చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా అధికారుల సమష్టి కృషితోనే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఒకే గ్రామంలో 197 కేసులు.. వలస బాట పట్టిన జనం
పెదపెంకి గ్రామంలో సామాజిక అంతరాలు, పారిశుద్ధ్య లోపం కారణంగా వ్యాధి వ్యాప్తి తీవ్రంగా మారింది. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండటంతో క్యూలెక్స్ దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల ఒకే గ్రామంలో ఏకంగా 197 బోదకాలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి భయంతో గ్రామంలోని జనాభా దాదాపు 12 శాతం మేర తగ్గిపోయింది. భయాందోళనకు గురైన పలువురు గ్రామస్థులు గ్రామాన్ని విడిచి వలస బాట పట్టారు. పారిశుద్ధ్య లోపంతో పాటు ఇక్కడ డెంగీ, చికున్‌గున్యా కలిగించే దోమల లార్వాలను కూడా అధికారులు గుర్తించారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
రూ.6.18 కోట్లతో మ్యాజిక్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణం
ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ 2018లోనే జనసేన పార్టీ తరపున స్పందించారు. అప్పటి నుంచే ఈ సమస్య పరిష్కారానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ. 6.18 కోట్ల భారీ నిధులతో మ్యాజిక్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు. డ్రైనేజీ ఆక్రమణల తొలగింపుతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. మొదటి విడతగా గ్రామంలో ఏర్పాటు చేసిన 20 మ్యాజిక్ డ్రెయిన్లు అక్కడ పారిశుద్ధ్య విప్లవానికి నాంది పలికాయి.
అభివృద్ధి నమూనాగా పెదపెంకి.. త్వరలో ఉప ముఖ్యమంత్రి పర్యటన
గ్రామస్థులను ఒప్పించి, వారి సహకారంతోనే అధికారులు ఈ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. మురుగు నీరు ఎక్కడా నిల్వ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పెదపెంకి గ్రామం ఒక అద్భుతమైన అభివృద్ధి నమూనాగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ విజయాన్ని సాధించిన జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, త్వరలోనే తాను స్వయంగా పెదపెంకి గ్రామాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!