భారత్‌లో ఇప్పుడు విద్యుత్ సంక్షోభంపై విస్తృతంగా చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్ కష్టాలు తప్పవనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా.. విద్యుత్ సంక్షోభం లాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఇక, దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని… రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేసిన ఆయన.. నిధులు ఎంతైనా వెచ్చించి విద్యుత్…
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై విద్యుత్ సంక్షోభం విషయంలో సెటైర్లు వేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఫై అయిన ఆయన.. ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం అని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని.. 40 రోజుల…
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం…
అమరావతి : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని…ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని… అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని… సీఎం నోటి వెంట…