AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు.. టీడీపీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్‌మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా..? అంటూ ఛాలెంజ్ చేశారు. నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్ చంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా అర్జా శ్రీకాంత్ నివేదిక ఇచ్చారన్న పయ్యావుల. సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం.. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు.. పిల్లల భవిష్యత్ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం.. ప్రభుత్వం కట్టుకథలతో లేనిపోని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.. సీమెన్స్ సంస్థతో ఒప్పందం పేరుతో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి నిధులు మళ్లించారనే ఆరోపణలు చేస్తున్నారు.. ఏయే ఖాతాలకు నిధులు వెళ్లాయో.. ఆ వివరాలు వెల్లడించండి.. ఖాతాల నెంబర్లను విడుదల చేయండి..? అంటూ బహిరంగ సవాల్ విసిరారు.
Read Also: Common Entrance Tests: ఏపీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు ఇవే.. ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన
సీమెన్స్ సంస్థకు నిధులు విడుదల చేస్తూ ప్రేమ్ చంద్రారెడ్డి సంతకం చేశారు. ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించడం లేదు..? అని ప్రశ్నించారు పయ్యావుల.. ప్రేమ్ చంద్రారెడ్డి ఏమైనా నాటి సీఎం చంద్రబాబు చెబితే సంతకం చేశానని చెప్పారా..? అని నిలదీశారు.. ప్రేమ్ చంద్రారెడ్డి కూడా ఆషామాషీగా నిధుల విడుదల చేయలేదు. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ చేయించి.. సర్టిఫికేషన్ చేయించిన తర్వాతే నిధులు విడుదల చేశారు. సాఫ్ట్ వేర్ వాల్యూయేషన్ చేసింది కేంద్ర రంగ సంస్థే.. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ చేయించిన విషయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు..? అని మండిపడ్డారు. సీమెన్స్ వ్యవహరంపై అర్జా శ్రీకాంత్‌ను ఈ ప్రభుత్వం నివేదిక అడిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లల్లో అధ్యయనం చేసి వచ్చి.. అంతా బాగుందని అర్జా శ్రీకాంత్ నివేదిక ఇచ్చారని తెలిపారు.
Read Also: MLA Raghunandan Rao : చట్టానికి ఎవరు చుట్టం కాదని ఇప్పటికైనా తెలుసుకో
అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు.. ఇప్పుడు మరోసారి అర్జా శ్రీకాంత్‌ను విచారణ పేరుతో పిలిచి కొట్టి తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కట్టు కథలు మళ్లీ మొదలు పెట్టారు. ఏదో పెద్ద స్కామ్ జరిగినట్టు చెప్పుకొస్తున్నారు. గత నాలుగేళ్లుగా చెప్పిన కథలే మళ్లీ చెబుతున్నారు. గుజరాత్ రాష్ట్రంతో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.. దాన్ని అధ్యయనం చేసి ఏపీ ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. గుజరాత్ సహా ఆరు రాష్ట్రాల్లో సీమెన్స్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. సీమెన్స్ సంస్థపై జీఎస్టీ విషయంలో ఆరోపణలు వచ్చాయి. 170కు పైగా దేశాల్లో సీమెన్స్ సంస్థ కార్యాకలాపాలు ఉన్నాయి. సీమెన్స్ సంస్థ చంద్రబాబు బినామీ సంస్థ అన్నట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని సీమెన్స్ సంస్థ భరించాలి. ఒప్పందాన్ని సరిగ్గా చదువుకుని విమర్శలు చేస్తే మంచిదని సూచించారు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ తరగతుల పర్యవేక్షణ చేపట్టాల్సిన బాధ్యత సీమెన్స్‌దే.. సీమెన్స్ సంస్థకు చెందిన సుమన్ బోస్, డిజైన్ టెక్ సంస్థకు వికాస్ మధ్య లావాదేవీలు జరిగాయి.. దానికీ టీడీపీకి ఏం సంబంధం..? అని నిలదీశారు. జగన్‌పై గతంలో మేం ఆధారాలతో ఆరోపణలు చేశాం. ఆధారాల్లేకుండా ఇప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టులకు వెళ్తామని హెచ్చరించారు పయ్యావుల కేశవ్.