Pawan Kalyan Strong Warning In Kakinada Press Meet: వైసీపీ నాయకుల తిట్లను తాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్.. వారి మాటలకు చేతలతో సమాధానం చెప్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే తనని తిట్టారో, భవిష్యత్తులో వారితోనే ‘మేము చింతిస్తున్నాను’ అని చెప్పిస్తానని పేర్కొన్నారు. మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని అన్నారు. తాను చేపట్టిన ‘జనవాహిని’ కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే తాను జనవాహిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు.
Upasana: ప్రెగ్నెంట్ అయ్యానని మొదటిసారి చరణ్ కు చెప్తే.. అలా అన్నాడు
గతంలో తనకు ఫిర్యాదు చేసిన మహిళ అన్నయ్య ఇంటికి రాలేదని.. ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అబ్బాయిని అన్యాయంగా చంపేశారని మండిపడ్డారు. ఆ మహిళ ఆవేదన ఈ ‘జనవాహిని’ కార్యక్రమమని తెలిపారు. వైజాగ్‌లో డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిని చేశారని, కాకినాడలో ప్రశ్నించిన పాపానికి ఒక మహిళ మానసిక స్థితి బాగోలేదని చెప్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చెరువుల్లో మట్టిని కూడా తవ్వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ యువతకి ఉపాధి లేదన్నారు. పిటిషన్లపై తాము అధ్యయనం చేస్తామన్నారు.
Pragya Jaiswal : బికినీ అందాలతో రెచ్చిపోయిన ప్రగ్యా..!!
అంతకుముందు కూడా.. వైసీపీ నాయకులు చేసే తప్పుల గురించి చదివి చదివి తనకు అలుపొచ్చిందని కత్తిపూడిలో నిర్వహించిన వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే.. ఆయనకు ఫోన్లో తాను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పానన్నారు. అంతేకాదు.. మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి తానెప్పుడూ మాట్లాడనని, మంచి పాలన ఇవ్వండని చెప్పననా అన్నారు. కానీ.. తన ఇంట్లో ఉన్న 4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించారని, అంత తప్పు తానేం చేశానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలైనా వేస్తానన్నారు.