Social Media: చంద్రబాబు, జగన్‌లను అధిగమించిన పవన్ కళ్యాణ్.. కానీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media: ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అయినా, సినిమా ప్రమోషన్లకు అయినా, వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్లకు అయినా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తిరేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్‌పైనే పెడుతున్నారు. ఏపీకి సంబంధించి అత్యధిక ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాప్‌లో ఉన్నారు. పవన్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4.9 మిలియన్లుగా ఉంది. 2009లోనే ట్విటర్ ఖాతా ప్రారంభించిన చంద్రబాబు తన వయసు 60 దాటినా యూత్‌తో పోటీ పడుతూ ఫాలోవర్లను సాధిస్తున్నారు. ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో సీఎం జగన్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయన ఖాతాలో 2.4 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.
Read Also: Team India: ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేసిన టీమిండియా.. టాప్ లేపింది ఎవరంటే..?
Also Read
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
అయితే పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ ఫాలోవర్లు ఉండటానికి కారణం ఆయన రెండు రంగాల్లో ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందే పవన్ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో సినిమాల పరంగానూ ఆయనకు ఫాలోవర్లు ఉన్నారు. అందువల్లే పవన్‌కు ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నారు. లేకపోతే ఈ విషయంలో చంద్రబాబు అగ్రస్థానంలో ఉండేవారు. ఏపీకి చెందిన మిగతా ప్రధాన నేతల్లో చాలా మంది నేతలు 2 మిలియన్ లోపు ఫాలోవర్లతోనే ఉన్నారు. అటు రాజకీయ పార్టీల వారీగా చూస్తే.. జనసేన ట్విటర్ ఖాతాను 1.9 మిలియన్ ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను 827K, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాను 547K ఫాలోవర్లు ఉన్నారు. కాగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి.
తాజావార్తలు
-
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
-
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్‌పై ఆసక్తికర విశ్లేషణ!
-
Curry Leaves Storage Tips: ఈ సులభమైన చిట్కా.. కరివేపాకు నెలల తరబడి తాజాగా ఉంటుంది..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!