Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్‌పై నిషేధం.. కారణమిదే!
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ముంబైలో ఫేమస్ వడాపావ్‌పై నిషేధం
- సమోసాలు, డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల విక్రయంపై కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన వడాపావ్‌తో పాటు సమోసాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల విక్రయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రాంగణాల్లోనే కాకుండా.. స్కూల్ పరిసరాల్లో 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్ విక్రయాలు, పంపిణీ, ప్రకటనలను నిషేధిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను పాఠశాలల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదు. డీప్ ఫ్రై చేసిన వంటకాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలతో పాటు వడాపావ్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు తదితర ఆహార పదార్థాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడాన్ని నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వడాపావ్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లను పాఠశాల ప్రాంగణాల్లో విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి 50 మీటర్ల పరిధిలో కూడా వీటి ప్రకటనలను అనుమతించబోమని పేర్కొన్నారు.
ఈ నిబంధనలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ముండే ఆదేశించారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పాఠశాల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనల అమలును పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తనిఖీలు ప్రారంభించనున్నట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పాఠశాల యాజమాన్యాలతో కలిసి జిల్లా, తాలూకా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలను సజావుగా అమలు చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!