Team India: టీమిండియా ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేసింది. బంగ్లాదేశ్‌తో ఆడిన రెండో టెస్టు ఈ ఏడాది భారత్‌కు చివరి మ్యాచ్. మొత్తం 71 మ్యాచ్‌లు ఆడిన భారత్ 46 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 21 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మూడు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. భారత్ విజయాల శాతం 64.78గా నమోదైంది. టెస్ట్ ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. మూడు టెస్టుల్లో ఓటమి పాలైంది. ఇందులో రెండు దక్షిణాఫ్రికాతో, ఒక మ్యాచ్ ఇంగ్లండ్‌తో టీమిండియా ఓడిపోయింది. వన్డేల విషయానికి వస్తే 24 వన్డేలు ఆడిన భారత్ 14 విజయాలు సాధించి 8 మ్యాచ్‌లలో ఓడింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
Read Also: Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. దారుణంగా పడిపోయిన సగటు
టీ20ల విషయానికి వస్తే 40 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 28 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఓటమి పాలు కాగా ఒక మ్యాచ్ టై, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టీ20 ఫార్మాట్‌లో భారత్ విజయాల శాతం 70గా ఉంది. అటు భారత్ తరఫున ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. అతడు మొత్తం 40 ఇన్నింగ్స్‌లు ఆడి 1732 బంతులు ఎదుర్కొన్నాడు. మొత్తం 1609 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతడు 1424 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 1380 పరుగులతో మూడో స్థానంలో, 1348 పరుగులతో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, 995 పరుగులతో రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు.