Pawan Kalyan మండపేట కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్లు చేశారు. అన్న వస్తాడని వైసిపి నేతలూ మోసం చేశారు. అన్న వస్తాడు, మావయ్య వస్తాడని మాయ మాటలు ఎందుకు? వైసీపీ నేతల్లా నాకు కోట్లు లేవు. ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చడానికి వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లా నుండే మార్పు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జగన్మోహనరెడ్డి లాగా ముద్దులు పెట్టుకోవాలి. అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకోవద్దు.
నిజంగా ప్రేమ ఉంటే అన్ని జిల్లాలతోపాటే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం ఎందుకు చేయలేదు? రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం వలనే అమలాపురం అల్లర్లకు కారణం అన్నారు పవన్ కళ్యాణ్. నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది. గెలిచినా గెలవకపోయిన ప్రజలకు అండగా ఉండి పోరాడతానన్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). మండపేటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం లభించింది. వర్షంలో సైతం కౌలు రైతుల బహిరంగసభకు భారీగా హాజరయ్యారు జనసైనికులు, వీర మహిళలు. కడియం మండలం పొట్టిలంకలో ఆత్మహత్యకు పాల్పడిన దళిత కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు పవన్. ఆలమూరు మండలం చొప్పుళ్ల మీదుగా దుళ్ల, ఏడిద గ్రామాల నుండి మండపేట బయలుదేరారు పవన్ కళ్యాణ్.
నిధులు వస్తాయనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. పంచాయితీ నిధులు దారి మళ్ళీంచి నిర్వీర్యం చేస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయితీలకు నిధులు ఇస్తాం అని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నిరుద్యోగుల ఉపాధి కోసం పది లక్షల రూపాయలు వంతున రుణాలు ఇస్తాం. త్వరలోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తాం అన్నారు పవన్. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు పవన్.
ICATP 2022 : వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో రవాణా దృగ్విషయాలలో పురోగతిపై అంతర్జాతీయ సమావేశం