విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహసభలో ఆ పార్టీ నేత పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో తాను అడుగు పెట్టగానే.. ‘బండి’ కదిలిందని… ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడంతో ఇక్కడ కూడా సోము బండి కదులుతుందన్నారు. ఏపీ ప్రజలు తెలియక ఫ్యాన్ స్పీడును 151కి పెంచేశారని.. ఎప్పుడైనా ఈ ఫ్యాన్ పడిపోవడం ఖాయమన్నారు. జగన్ హిందూవునని నమ్మించి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు. ఏపీలో పలు చోట్ల ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనా పట్టించుకోలేదని.. రామతీర్ధంలో రాముని తల తీసేసినా వ్యక్తిని…
శ్రీ పీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణనంద కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా దాడులు ఆగడం లేదన్నారు పరిపూర్ణానంద. దేవాలయాల పరిరక్షణ కోసం సామాజిక సృహ పెరగాలన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండ అత్యంత పాశవికం అన్నారు. కరోనా ఆంక్షలు పేరుతో హిందూ పండగలను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కరోనా ప్రభుత్వానికి పట్టింది.. సమాజానికి పట్టలేదన్నారు. దేవాలయ భూములు హిందువులే కోల్పోతున్నారని, మతమార్పిడులు ఇప్పటికిప్పుడు జరగడం లేదు. దశాబ్దాలుగా జరుగుతూనే…