వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఈ ఏడాది మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈకేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల హత్య కేసులో తమకు సంబంధం లేదని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. మూడు నెలల క్రితం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: 2027 World Cup: రోహిత్, కోహ్లీలు…
పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో TDP నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల క్రితం వీళ్లను కారుతో గుద్ది చంపారు ప్రత్యర్థులు. ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రమ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.