CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మూడు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొనగా, స్వచ్ఛాంధ్ర మరియు అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటేనే నిజమైన ఆనందం ఉంటుందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని, రైతుల సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించామని చెప్పడం లేదని, అయితే వారికి అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని విమర్శించారు.
ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్
రసాయన ఎరువుల వినియోగం పెరగడం వల్ల భూమి సారవంతత దెబ్బతింటోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భూమి కన్నతల్లితో సమానమని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, కల్తీ లేని గానుగ నూనె వినియోగం పెంచాలని సూచించారు. చైనా తిరస్కరించిన మిర్చి ఎగుమతుల అంశాన్ని ప్రస్తావించిన సీఎం, గుంటూరు మిర్చికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. తోతాపురి మామిడికి కిలోకు రూ.4 మద్దతు ధర అందించామని, బర్లీ పొగాకు కొనుగోలు చేశామని చెప్పారు. సాధారణ పొగాకు ధరలు పడిపోకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
పామాయిల్, హార్టికల్చర్‌కు ప్రోత్సాహం
పల్నాడు జిల్లాలో 20 మండలాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు.. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో మామిడి, ఆక్వా రంగాలు దెబ్బతిన్నాయని, ఆక్వా రైతులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, 2027 మార్చి-ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నదుల అనుసంధానం ఎన్టీఆర్ సంకల్పమని, అది తన జీవితాశయమని పేర్కొన్నారు. పెన్నా సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నదులను అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారిపై విమర్శలు
కొన్ని రాజకీయ పార్టీలు విషం చిమ్మడం, అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మరే పని చేయడం లేదని సీఎం విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, రైతు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!