Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్
- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
- 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన తురక కిషోర్
- మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న తురక కిషోర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్‌ను.. పోలీసులు ఈరోజు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా.. పలు కేసుల్లో తురక కిషోర్ నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
తురక కిషోర్‌పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధ వెంకన్నలపై మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కిషోర్ దాడి చేశాడు. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను, పార్టీ కార్యాలయం వాహానాలను ధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
2024 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున పలు హింసకాండలో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెంటచింతల మండలం పాలువాయి గేటులో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్‌గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలాగే మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టీడీపీ నేత ఎనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువురిని గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామి పై దాడి, టీడీపీ కార్యాలయం విధ్వంసం, తెలుగుదేశం నాయకుల వాహనాలు ధ్వంసం చేసిన కేసులో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!