ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డీఏ బకాయిలు, పీఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, శాఖల వారీగా విధుల విభజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా జాబ్ చార్ట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: AP: రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి..
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. ఏడు నెలల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు. ఉద్యోగుల పని వాతావరణం మెరుగుపరుస్తాం అన్నారు.. ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా అని పేర్కొన్నారు. ఉద్యోగులకు గౌరవం లేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో పెన్షన్ పంపిణీ చేయిస్తున్నారు.. మహిళా ఉద్యోగులను ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతున్నారన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
Read Also: CMR College: సీఎంఆర్ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్..
పీఆర్సీ ఇవ్వడం తర్వాత.. కనీసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయండని తెలిపారు. కొత్త సంవత్సరం జనవరి 1న జీతాలు రావాలి.. ఉపాధ్యాయులకు ఇంకా జీతం లేదని చెప్పారు. ఉద్యోగులకు సరైన పని వాతావరణం కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని వెంకట్రామి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.