Palnadu: చాక్లెట్ ఇస్తానని బాలిక అపహరణకు యత్నం.. నిందితుడికి దేహశుద్ధి
- వినుకొండలో పాపను అపహరించేందుకు విఫలయత్నం
- చాక్లెట్ ఇస్తానని పాపను ఎత్తుకు వెళ్లబోయిన ఆగంతకుడు
- పట్టుకుని వ్యక్తికి దేహశుద్ధి చేసిన స్థానికులు
- కిడ్నాపర్‌ను పోలీసులకు అప్పగించిన స్థానికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నం చేశాడు ఓ ఆగంతకుడు.. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జరిగింది.
Read Also: Barlapudi Kranti: నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని చాలా బాధపడ్డా..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
వివరాల్లోకి వెళ్తే.. ఇసుక వాగు ప్రాంతం వద్ద ఆడుకుంటున్న ఓ బాలికకు చాక్లెట్ ఇచ్చి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశాడు దుండగుడు. దీంతో చాక్లెట్ కోసమని బాలిక ఆ యువకుడు దగ్గరికి వెళ్లింది. ఈ లోపు బాలికను అపహరిస్తున్నాడన్న అనుమానం అక్కడున్న స్థానికులకు వచ్చింది. దీంతో ఆగంతకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అనంతరం.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దుండగుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.
అయితే పోలీసుల సహకారం, స్థానికుల సమయస్ఫూర్తితో తమ బిడ్డకు ఎలాంటి ఆపద రాకుండా బయటపడిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్‌కు ప్రయత్నించిన వ్యక్తి దగ్గర నుండి బాలికను రక్షించిన పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బయటకు ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలను.. తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?