మంచులో కూరుకుపోయి 22 మంది పర్యాటకులు మృతి

పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీలో భారీస్థాయిలో కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడనీయలేనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా వాహనాల్లో ఉన్న వారిలో 22 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వందలాది వాహనాలను మంచు నుంచి వెలికితీశామని.. వెయ్యికిపైగా వాహనాలు ఇంకా మంచులోనే కూరుకునిపోయి ఉన్నట్లు వారు వివరించారు.

Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు వడగళ్ల వర్షాలు

కాగా విపరీతమైన మంచు కారణంగా కార్లలోనే గడ్డకట్టిపోయి ఆరుగురు మరణించారని, మిగతా వారు ఎలా చనిపోయారో ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఇస్లామాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ముర్రీకి ప్రతి ఏడాది శీతాకాలం సందర్భంగా లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తారని… ఇక్కడి హిమపాతం పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. అయితే ఈ ఏడాది శనివారం రోజు భారీ స్థాయిలో 4 అడుగులకు పైగా మంచు కురవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయిందని పోలీసులు తెలిపారు. దీంతో ప్రయాణికులు వాహనాల్లోనే చిక్కుకుపోయారన్నారు.

Related Articles

Latest Articles