ఏపీలో సినిమా టికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి పలకనుంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌లో టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు ఏపీఎఫ్‌డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువర్ స్క్రీన్స్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ విధానంతో…