సభలో టీడీపీ నేతల వైఖరి తలదించుకునేలా ఉందన్నారు విప్ కోరుముట్ల శ్రీనివాస్. టీడీపీ నేతలు అసలెందుకు సభకు వస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రోజూ రావడం గొడవ గొడవ చేయడం ఇదేనా మీ పని. ఎన్టీఆర్ పేరు పలకడానికి కూడా టీడీపీ నేతలకు లేదు. ఎన్టీఆర్ పై జగన్ కు అమితమైన గౌరవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు.
టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్. అంబేద్కర్ పేరు పెడితే గొడవలు సృష్టించారు. కుప్పం ప్రజల జీవన విధానంలో మార్పులొచ్చాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా సంక్షేమం అందడంతో ప్రజలు మాకు అండగా నిలిచారు. కుట్రలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ జగన్ కు ప్రజల్లో ఆదరణ రావడం తట్టుకోలేక చంద్రబాబు ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటాడు. మరో విప్ కరణం ధర్మశ్రీ సభలో టీడీపీ నేతలు రోజుకో విన్యాసం చేస్తున్నారని విమర్శించారు. అరణ్యవాసంలో ఉండి అజ్ఞాతవాసం చేస్తున్నా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎన్టీఆర్ పై అపారమైన ప్రేమ ఉన్నట్లు టీడీపీ నేతలు నటిస్తున్నారు. మనుషుల్ని వాడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
ఎన్టీఆర్ పేరు చెప్పి రాజకీయ వ్యభిచారం చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. ఎన్టీఆర్ పట్ల అంత ప్రేమ ఉంటే పథకాలకు ఎందుకు ఆయన పేరు పెట్టలేదు. ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్లకార్డు తేవడం నిరసన చేయడం..ప్రదర్శించడం బయటికి పోవడం ఇదే టీడీపీ పని. సభలో ఈరోజు టీడీపీ నేతల ప్రవర్తన బాధాకరం..
స్పీకర్ పట్ల టీడీపీ నేతలు అమర్యాదగా ప్రవర్తించారు. బలహీన వర్గానికి చెందిన స్పీకర్ పట్ల ప్రతిపక్షపార్టీకి మొదటి నుంచి చిన్నచూపే. స్పీకర్ కు మొత్తం టీడీపీ నేతలంతా క్షమాపణ చెప్పాలి. ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ఆర్. హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతుందే టీడీపీ భయపడుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ నుంచి ఎన్టీఆర్ పేరు తీసేస్తానని చెప్పింది చంద్రబాబు కాదా? మరి ఇప్పుడెందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు సన్ క్షోభంలో ఉన్నాడు.. టీడీపీ పార్టీ సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.
Read Also: Kusukuntla Prabhakar :మునుగోడు ఉపఎన్నికపై టీఆర్ఎస్ నాన్చుడు వెనుక మతలబు ఏంటి?