CM Jagan Review: ఆదాయం తెచ్చే శాఖలపై జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంకు వివరాలు అందించారు అధికారులు. రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్ష చేశారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు అధికారులు.
మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్న సీఎం. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్నారు జగన్.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్నారు సీఎం. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అన్నారు. దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు అధికారులు.
14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ఈ నెంబరు పోస్టర్‌ను డిస్‌ప్లే చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నెంబరు డిస్‌ప్లే చేయాలి. పటిష్టమైన చర్యలు ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్నారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో డిస్‌ప్లే చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు. అప్పుడే ప్రజలు ముందుకు వస్తారని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు సీఎం.
Shivshankar Wife Protest: నిత్య పెళ్ళికొడుకు సొంతూళ్ళో భార్య ఝాన్సీ నిరసన
అటవీ పర్యావరణ శాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రెడ్ శాండిల్ ఆక్షన్– గ్లోబల్ టెండర్ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయన్నారు. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి నెలా స్టాక్‌కు సంబంధించిన వివరాలు చెక్ చేసుకుంటూ… వివరాలు నమోదు చేయాలన్నారు. పక్కాగా స్టాక్ వెరిఫికేషన్ చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై సమీక్ష చేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించిందన్నారు సీఎం. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలన్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!