Heavy Rain In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ భారీ చెట్లు కుప్పకూలిపోయాయి. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వానాలు పడుతున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలందరూ అలర్టుగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
Read Also: Hyderabad: అల్వాల్ లో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి..
ఇక, కృష్ణా జిల్లాలోని పెనమలూరులో జాతీయ రహదారిపై భారీ వృక్షం ఆటోపై నేల కొరిగింది.. దీంతో ఆటో నుజ్జు నుజ్జ అయిపోయింది. ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే, వర్షం ఎఫెక్ట్ తో నీట్ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వర్షంలో తడుస్తూనే క్యూ లైన్ లు నిల్చున్నారు. చెకింగ్ పూర్తైన తర్వాత మాత్రమే లోపలికి అధికారులు పంపిస్తున్నారు. అడ్మిట్ కార్డు, ఐడెంటీ ఫ్రూఫ్ మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, గాజులు, చెవి దిద్దులు, ఇతర వస్తువులు ఉంటే చెకింగ్ కేంద్రాల వద్ద అడ్డుకుంటున్నారు సిబ్బంది.