Kurnool: హంద్రీనీవా ప్రధాన కాలువను పూడ్చేసిన నేషనల్ హైవే కాంట్రాక్టర్..
- బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను పూడ్చేసిన నేషనల్ హైవే కాంట్రాక్టర్..
- శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు. జూన్ ఆఖరు నాటికి కాలువలో మట్టి తొలగిస్తామనే కండిషన్ తో ఇరిగేషన్ అధికారులు అనుమతించారు. జూలై ముగిసినా కాలువలో మట్టి తొలగించకపోవడంతో శ్రీశైలం జలాలను అధికారులు విడుదల చేయలేదు.
Read Also: Kejriwal: ఆగస్టు 12న సీబీఐ చార్జిషీట్ పరిశీలించనున్న ఢిల్లీ కోర్టు
Also Read
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
కాగా, ఇరిగేషన్ అధికారులు నోటీస్ ఇచ్చినా నేషనల్ హైవే కాంట్రాక్టర్ స్పందించలేదు.. హైవే కాంట్రాక్టర్ తీరుతో హంద్రీనీవా కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పాడింది. హంద్రీనీవా కాలువలో కాంట్రాక్టర్ మట్టి తొలగించి నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ దుస్థితిని సీపీఎం నేతల బృందం పరిశీలించారు.
Read Also: Minister Ramprasad Reddy: ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేశారు..?
ఇక, తక్షణమే ఎన్ హెచ్ ఏఐ డైవర్షన్ రోడ్డును తొలగించి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరందించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కర్నూలు- ఆత్మకూరు హైవేలో బ్రిడ్జి కోసం హంద్రీనీవా కాలువ పూడ్చి వేశారు అంటూ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నీటితో నిండినప్పటికీ రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడం విచారకరం అని మండిపడ్డారు. ఆగస్టు 1వ తేదీన మడకశిరకు వస్తున్న సీఎం రాయలసీమ కరువు ప్రాంతాల్లో పర్యటించాలి అని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
-
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా..?
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!