Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
- నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారా?
- కిందపడుతున్నట్లు అనిపించడం సాధారణమేనా?
- ‘‘హిప్నిక్ జర్క్’’ సమయంలో శరీరంలో ఏం జరుగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hypnic Jerk: కొన్ని సందర్భాల్లో, నిద్రలో మనం పడిపోతున్నట్లు, నడుస్తున్నప్పుడు కాలు జారుతున్నట్లు అనిపించి, ఉలిక్కిపడి మేలుకుంటాం. ఇది సాధారణంగా ప్రతీ వ్యక్తికి ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుంది. దీనిని ‘‘హిప్నిక్ జర్క్’’ అని పిలుస్తారు. దీనినే హిప్నగోజిక్ జర్క్, స్లీప్ స్టార్ట్, నైట్ స్టార్ అని కూడా అంటుంటారు. హిప్నిక్ జర్క్ అంటే నిద్రలో అకస్మాత్తుగా కండరాలు కుదుపులకు గురవ్వడం జరుగుతుంది.
ఎందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది?
నిజానికి దీనికి కారణం ఏంటనేది సరైన కారణం శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. అయితే, కొన్ని వివరణల ప్రకారం.. మనం నిద్రలోకి జారుకుంటున్నప్పుడు మన కండరాలు క్రమంగా సడలిపోతాయి. ఈ సమయంలో మెదడు కొన్ని సార్లు శరీరం మారుతున్న స్థితిని బ్యాలెన్స్ కోల్పోయిన స్థితిగా భావిస్తుంటుంది. దీనికి ప్రతిస్పందనగా కండరాలను ఉత్తేజపరిచేందుకు మెదడు సంకేతాలు పంపవచ్చు. దీని వల్లే ఆకస్మిక కుదుపుల్ని మనం అనుభూతి చెందుతాము.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
ఉదాహరణకు మీరు మెట్లపై నిలబడి ఉన్న సమయంలో, అకస్మాత్తుగా కాలు జారితే, మన మెదడు వెంటనే ప్రతిస్పందించి బ్యాలెన్స్ చేయడానికి మన శరీరాన్ని ప్రేరేపిస్తుంది. వెంటనే కండరాలను యాక్టివ్ చేస్తుంది. సరిగా ఇలాగే నిద్రలో కూడా సంభవిస్తుంది. నిద్రలో శరీరం వేగంగా మారుతున్నప్పుడు, ఈ మార్పును వెంటనే మెదడు గ్రహించి, కండరాలను యాక్టివ్ చేస్తుంది.
మరో వివరణ ప్రకారం.. నిద్రలోకి జారుకునే సమయంలో మెదడు, నాడీ వ్యవస్థ కార్యకలాపాలు వేగంగా మారుతాయి. ఈ సమయంలో రిటిక్యులర్ బ్రెయిన్‌స్టెమ్ ప్రాంతంలోని నరాల మధ్య జరిగే తాత్కాలిక ‘‘మిస్ ఫైర్’’ ఆకస్మిక కండరాల కుదుపుకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏం చేస్తే ఈ పరిస్థితి ఎక్కువ అవుతుంది.?
హిప్నిక్ జర్క్ సాధారణంగా హానికరం కాదు. అయితే నిద్రలేమి, ఒత్తిడి, అధిక కేఫిన్ తీసుకోవడం, అతిగా అలసిపోవడం వంటి పరిస్థితుల్లో ఇది కనిపించవచ్చని నిపుణులు చెబుతుున్నారు. రాత్రి ఆలస్యంగా అధిక ఉత్తేజితం కలిగించే పదార్థాలు తీసుకోవడం, నిద్ర సమయంలో గందరగోళంగా ఉండటం కూడా ప్రభావం చూపొచ్చు. ప్రతీరోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, తగినంత నిద్ర, రాత్రి సమయంలో కెఫీన్ తగ్గించడం, నిద్రకు ముందు ఒత్తిడి తగ్గించుకుంటే ఈ పరిస్థితిని తగ్గిస్తాయి.
ఆదిమ మానవుడిని నుంచి వచ్చిందా?
హిప్నిక్ జర్క్కు కొందరు ‘‘పరిణామ సిద్ధాంతం’’ కారణమని చెబుతున్నారు. మన ప్రాచీన కాలంలో పూర్వీకులు చెట్లపై, అస్థిరమైన భూభాగాలపై నిద్రించే వారు. ఆ సమయంలో శరీరం ఒక్కసారిగా సడలిపోవడం వంటివి జరిగేది. దీనిని పడిపోవడానికి సంకేతంగా మెదడు భావించి కండరాలను ఒక్కసారిగా బిగించడానికి ప్రతిస్పందించేది. ఆ కాలం నుంచి మానవుడిలో హిప్నిక్ జర్క్ డెవలప్ అయిందని కొంతమంది భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?