Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చ మరోసారి మొదలైంది. ఇప్పటికే టెస్టు, టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎంతకాలం క్రికెట్ కొనసాగించాలనేది అతడి ఇష్టమని చెప్పాడు. అయితే సత్తా, అత్యున్నత స్థాయిలో ఆడాలనే కోరిక తప్పకుండా ఉండాలని చెప్పుకొచ్చాడు. ఎవరూ జీవితాంతం క్రికెట్ ఆడలేరని, ఒక దశలో క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిందే అని హేడెన్ పేర్కొన్నాడు.
‘క్రికెట్ కెరీర్లో ఒక దశకు చేరుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు తప్పవు. రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ, అంతకంటే ముందు గౌతమ్ గంభీర్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎవరూ జీవితాంతం క్రికెట్ ఆడలేరు. ఒక దశలో ఐపీఎల్ లేదా అంతర్జాతీయ క్రికెట్లో ఏదికి ముందుగా వీడ్కోలు చెప్పాలనే ప్రశ్న వస్తుంది. రోహిత్ ఇప్పటికే టెస్టులకు రిటైర్ అయ్యాడు. ఇక ఎంతకాలం ఆటలో కొనసాగాలన్నది అతడి వ్యక్తిగత నిర్ణయం. అత్యున్నత స్థాయిలో పోటీ పడాలంటే యువకుడికి ఉండే శక్తి, ఉత్సాహం అవసరం’ అని హేడెన్ అన్నాడు.
Also Read
- Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
- IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
- Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
39 ఏళ్ల రోహిత్ శర్మ వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అతడు తన బ్యాట్‌తో విమర్శకులకు సమాధానాలు ఇస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా రన్స్ చేయకపోవడంతో.. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కావచ్చనే ప్రచారం జరిగింది. అయితే హిట్‌మ్యాన్ 110 బంతుల్లో 138 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో 58.33 సగటు, 98.31 స్ట్రైక్‌రేట్‌తో 175 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. 288 మ్యాచ్‌ల్లో 48.95 సగటు, 93.04 స్ట్రైక్‌రేట్‌తో 11,895 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 264 పరుగులు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది వన్డేల్లో 42.11 సగటుతో 379 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 138.
2027 వన్డే ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే మాత్రం 39 ఏళ్ల వయసులోనూ హిట్‌మ్యాన్ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా పరుగులు చేస్తున్నాడు. తాను ఇంకా కొనసాగాలా, ఎప్పుడు వీడ్కోలు పలకాలా అన్న తుది నిర్ణయం మాత్రం రోహిత్ చేతుల్లోనే ఉంటుందని మ్యాథ్యూ హేడెన్ అంటున్నాడు. వన్డే ప్రపంచ కప్ గెలవడం తన కల అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. కాబట్టి హిట్‌మ్యాన్ తప్పకుండా ప్రపంచ కప్ పూర్తయ్యే వరకు వీడ్కోలు పలికే అవకాశం లేదు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!