దేశంలో గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా చమురు ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.115.42కి చేరింది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి 101.58గా నమోదైంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ 91 పైసలు పెరిగి రూ.114.93గా, లీటర్ డీజిల్ 87 పైసలు పెరిగి రూ.101.10గా ఉన్నాయి. మరోవైపు…
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ మేరకు గ్యాస్ సిలిండర్‌కు దండలు వేసి డప్పులు కొడుతూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం…
హైదరాబాద్ నగరంలో వాహనం లేని వారు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరిలో చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లను బుక్ చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ చేదువార్తను అందించింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా త్వరలో క్యాబ్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఏసీలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్…
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై నెలరోజులు కావస్తోంది. ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపించటం ప్రారంభమైంది. ముడి చమురు, ఇందన ధరలతో పాటు నిత్యావసరాలైన వంట నూనెలు, ప్యాక్డ్ ఐటెమ్స్, కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మున్ముందు ఈ ధరల భారంతో సామాన్యుడు మరింతగా కుదేలయ్యే ప్రమాదం ఏర్పడింది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే సామాన్యుడి జీవన శైలి ఘోరంగా దెబ్బతింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి.…
దేశవ్యాప్తంగా సుదీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో సుమారు ఐదు నెలల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు పెరగడం ప్రారంభించాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర…
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.15, డీజిల్ రూ.22 మేర పెరగనున్నాయని ఐఏఎన్‌ఎస్ రిపోర్ట్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా 125 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న చమురులో 80 శాతం దిగుమతుల…
మార్చి 1 నాటికి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలు ఒక్కో లీటరుపై 5.7 నష్టాన్ని భరిస్తున్నాయి. మునుపటి తరహాలో సాధారణ మార్జిన్లను కంపెనీలు పొందాలంటే ఒక్కో లీటర్‌పై… దాదాపు పది రూపాయలు పెంచాల్సి వస్తుంది. సామాన్యులపై భారాన్ని దించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే సూచనలున్నాయి. మార్చి 7న యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ సైతం ముగుస్తుంది. మార్చి 10న…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడింది. ఈ ప్రభావం ఇండియా మీద కూడా పడబోతోంది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అనంతరం ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు…
మరోసారి గ్యాస్ ధరలు పెరిగాయి.. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్‌కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. అయితే, దీని వెనుక కూడా ఓ లాజిక్…