Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
- సియోల్‌లో ప్రవాస తెలుగువారితో లోకేష్ భేటీ
- ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వం సిద్ధం
- 3S మోడల్‌తో ఇన్వెస్టర్లకు ఆహ్వానం
- నైపుణ్య విద్యపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా (ప్రవాస తెలుగువారి) ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విదేశాల్లో స్థిరపడిన ప్రతి ఒక్క తెలుగువాడూ ఆంధ్రప్రదేశ్‌కు ఒక ‘బ్రాండ్ అంబాసిడర్’ అని కొనియాడారు. “మీరు సాధించే ప్రతి విజయం, మీరు ప్రారంభించే ప్రతి వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో గర్వకారణం. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన రాష్ట్ర అభివృద్ధి గాథను, ఇక్కడి అవకాశాలను చాటిచెప్పాలి” అని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ రంగంలోనైనా కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న లోకేష్.. అత్యంత వేగవంతమైన అనుమతులు, పారదర్శకమైన పాలనతో నిజాయితీ గల ప్రతి పెట్టుబడిదారుడికీ, ఆవిష్కర్తకూ స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు.
దక్షిణ కొరియా ప్రగతి మనకు ప్రేరణ.. కియా ఒక మైలురాయి
శ్రమ, ఆవిష్కరణ, సాంకేతిక దృక్పథం ఉంటే ప్రకృతి వనరులు లేకపోయినా దేశాలు ఎలా అభివృద్ధి చెందవచ్చో శామ్సంగ్, హ్యుందాయ్, ఎల్జీ, కియా వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా దక్షిణ కొరియా నిరూపించిందని లోకేష్ కొనియాడారు. ఈ విజయగాథ ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప ప్రేరణ అని చెప్పారు. భారత్-కొరియాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదని, ప్రజాస్వామ్య విలువలు, యువతపై పెట్టుబడి వంటి పటిష్ట మూలాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. గతంలో కియా సంస్థ భారతదేశంలో తమ తొలి ప్లాంట్ కోసం అన్వేషిస్తున్నప్పుడు, ఏపీ ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు, పారదర్శకత, మౌలిక సదుపాయాలతో నిజమైన భాగస్వామిగా నిలిచిందని గుర్తుచేశారు. నేడు ఆ ప్లాంట్ కేవలం కార్ల తయారీ కేంద్రంగానే కాకుండా ఒక పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌గా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని, భవిష్యత్తులో ఐటీ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ (AI) వంటి రంగాల్లో కియా తరహా మరిన్ని సక్సెస్ స్టోరీలను సృష్టించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
Also Read
3S మోడల్‌తో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఒక సరికొత్త అభివృద్ధి దశలోకి అడుగుపెట్టిందని మంత్రి లోకేష్ వివరించారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఆశించే వేగం (Speed), పాలనా స్థిరత్వం (Stability), మెరుగైన సేవ (Service)లను మిళితం చేస్తూ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘3S’ మోడల్ కారణంగా రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత నమ్మకమైన ప్రాంతంగా మారిందన్నారు. తాము అనుసరిస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అంతర్జాతీయ వ్యాపార వర్గాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యావ్యవస్థలో మార్పులు
ప్రతి ఏటా ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న లక్షలాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాలు కల్పించేందుకు విద్యావ్యవస్థను సమగ్రంగా పునఃరూపకల్పన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అధునాతన పరిశ్రమ క్లస్టర్ల ఆధారంగా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని, తద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ అనుభవం పొందుతారన్నారు. మన విద్యార్థులు కేవలం స్థానికంగానే కాకుండా సియోల్, టోక్యో, బెర్లిన్, సిలికాన్ వ్యాలీ వంటి ప్రపంచ నగరాల్లో పోటీపడేలా అంతర్జాతీయ భాషలను కూడా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూనే, ఎల్లప్పుడూ జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో కలిసి ముందుకు సాగుతుందని, బలమైన రాష్ట్రాలే బలమైన భారతదేశాన్ని నిర్మిస్తాయని తాము నమ్ముతామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలకు మద్దతుగా APNRT ద్వారా నిరంతరం సేవలు అందిస్తున్నామని, విదేశాల్లో ఉన్నా విద్యార్థులు, కార్మికులకు అత్యవసర సమయాల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం, అధునాతన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని.. కలిసికట్టుగా బలమైన ఆంధ్రప్రదేశ్‌ను, బలమైన భారత్‌ను నిర్మించే ఈ మహా యజ్ఞంలో ప్రవాసాంధ్రులంతా భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?