AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల తాజా కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 807 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువును మరో మూడు రోజులు పొడిగించింది. దీంతో దరఖాస్తుదారులు అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. మొత్తం 807 దుకాణాల్లో 799 ఓపెన్ కేటగిరీకి, 8 రిజర్వుడ్ కేటగిరీకి చెందినవి ఉన్నాయి. పునరుద్ధరణ జరగని లేదా ప్రస్తుతం పనిచేయని మద్యం దుకాణాల స్థానంలో ఈ తాజా కేటాయింపులు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుల పరిశీలనను అక్టోబర్ 7న, డ్రా ఆఫ్ లాట్స్‌ను అక్టోబర్ 8న నిర్వహించనున్నారు.
21 సంవత్సరాలు పైబడిన, నిబంధనల ప్రకారం అనర్హత లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు, రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఏ4 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఆన్లైన్, హైబ్రిడ్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత గడువులో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?