ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర బుద్ది చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ జగన్ అంటున్నానంటూ ధ్వజమెత్తారు. ఇలానే వరుసగా నాలుగు ట్విట్లు చేశారు. తెలుగుదేశం సహనం.. చేతకానితనం కాదని అనుకుంటున్నావా..? అంటూ ప్రశ్నించారు. నీ అరాచకాలపై ఆగ్రహంగా ఉన్న కేడర్ కి మా లీడర్ కను సైగ చేస్తే చాలు అంటూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు.