ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు లోకేష్. కరోనా మహమ్మారి నేపథ్యంలో 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని కోరారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేశాయని పేర్కొన్న లోకేష్…. లక్షల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదమని పేర్కొన్నారు.
read also : రేపే పీసీసీగా రేవంత్ బాధ్యతల స్వీకరణ.. షెడ్యూల్ ఇదే
దీనికి ప్రత్యామ్నాయమార్గాన్ని ఏపీ ప్రభుత్వం అన్వేషించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ వద్దంటూ కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు ప్రారంభిం చారని గుర్తు చేశారు. ఆ పరిస్థితితులను ఏపీలో రాకుండా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు లోకేష్.
సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ @ysjagan గారికి లేఖ రాసాను. 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేసినందున విద్యార్థులు..,(1/4) pic.twitter.com/2dZYvI8BFg
— Lokesh Nara (@naralokesh) July 6, 2021