రేపే పీసీసీగా రేవంత్‌ బాధ్యతల స్వీకరణ.. షెడ్యూల్‌ ఇదే

రేపు టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధత్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే… గాంధీ భవన్‌ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రేపు పదవీ బాధత్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్‌ రెడ్డి. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా నాంపల్లి దర్గాకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు రేవంత్‌.

read also : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్ల వివాదం !

ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ భవన్ చేరుకోనున్నారు. 1.30 గంటలకు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి పదవీ భాద్యతలు స్వీకరిస్తారు రేవంత్‌ రెడ్డి. తదనంతరం గాంధీ భవన్ ఆవరణలో బహిరంగ సభలో మాట్లాడుతారు. కాగా.. రేవంత్‌ రెడ్డి తో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ సభ్యులు రేపే బాధ్యతలు చేపట్టనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-