Ashok Gajapathi Raju: అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చేయాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలని సూచించారు మాన్సస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చెయ్యాలన్నారు.. రకరకాల సేవులున్నాయి.. అందరం కలిసి చెయ్యాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలన్నారు.. అమ్మవారికి సేవ చేసే బాధ్యత నాపై మా పెద్దలు ఉంచారు.. అలాగే నడుచుకుంటున్నాం.. పారదర్శకత…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా, పాలకుల విధానాలు మారిపోయానా.... కాకినాడలో రేషన్ మాఫియా తీరు మాత్రం మారలేదట. మేమింతే.... అడ్డొచ్చేదెవడహే....అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. డైరెక్ట్‌గా డీలర్ల నుంచే ఎత్తేసి డంప్ చేసుకుంటున్నారట. బియ్యం ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి వెళ్లాలనే లెక్కలన్నీ ఒకటో తేదీ నుంచే తయారు అయిపోతున్నాయట.
గడచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిపారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష నిర్వహించారు.. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నాం అన్నారు..
Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై…
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలిస్తే.. నర్సీపట్నంలో ఓడిపోయారు అయ్యన్న పాత్రుడు. ఎమ్మెల్యేగా గెలిచిన గంటా రాజకీయ పరిస్థితుల వల్ల మూడున్నరేళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. అసలు టీడీపీలో ఉంటారో లేదో అన్నట్టుగా అనేక ప్రచారాలు జరిగాయి. ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడు మాత్రం టీడీపీ స్వరం గట్టిగానే వినిపించారు. అవకాశం వస్తే అధికారపార్టీపై ఒంటికాలిపై లేచి రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఇంకా ఎదుర్కొంటున్నారు…
నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రకాశం జిల్లాలో విషాదంగా మారింది.. పెళ్లి చేసుకుని నెల దాటిందో లేదో.. అప్పుడే ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ప్రియాంక-మహానందికు వివాహం జరిపించారు పెద్దలు.. ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు మహానంది.. అయితే, వారి కుటుంబంలో కలహాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.. దీంతో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం…
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమ్మె అన్ని విభాగాలను తాకుతోంది.. ఓవైపు ప్రభుత్వం చర్చలు అంటుంటే.. మరోవైపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, పాత పే స్కేల్‌ను ఉద్యోగులు కోరుతుంటే.. కొత్త పే స్కేల్ ప్రకారమే చెల్లింపులు చేస్తామంటోంది ప్రభుత్వం.. అయితే, వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ఆర్ధిక శాఖ.. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలు…