Nakka Anandbabu: అడ్డూఅదుపూలేని అక్రమ మైనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ (illegal Mining) పై వైసీపీ నేతలు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు (Nakka Anandbabu). వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ పై సిగ్గు పడాల్సింది పోయి. నిర్లజ్జగా సమర్దించుకుంటూ మసి పూసి మారేడికాయ చేస్తున్నారు.మూడేళ్ల వైసీపీ బకాసురుల చేతిలో రాష్ట్రంలోని కొండలు, గుట్టలు అన్నీ కరిగిపోతున్నాయి.వైసీపీ మూడేళ్లల్లో చేసిన అభివృద్ది శూన్యం.వైసీపీ ఎజెండా కేవలం దాచుకో.. దోచుకో అనే విధంగా ఉంది.175 నియోజకవర్గాలు ఉంటే.. 150 నియోజకవర్గాల్లో యధేచ్చగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు దోచుకుంటున్నారు.హైకోర్టు చరిత్రాత్మక కొండలను కాపాడుకోవాలని చెప్పినా.. అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చి తప్పు దోవ పట్టిస్తున్నారని ఆపంద్ బాబు విమర్శించారు.
KTR: ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులు
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
వైసీపీ సర్కార్ వల్ల చరిత్రాత్మక విశాఖపట్నం రిషికొండ కనుమరుగైపోయింది.కోర్టులన్నా, ఎన్‌జీటీలన్నా వైసీపీ సర్కార్‌కు లెక్కలేదు.మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి బాక్సైట్ ద్వారా 15 నుంచి 20 వేల కోట్ల కుంభకోణానికి తెర తీశారు.అక్రమ మైనింగుపై టీడీపీ నిజనిర్దారణ కమిటీ వెళ్లి పరిశీలిస్తే మాపై కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1000కు వస్తే.. ఇప్పుడు దాన్ని రూ. 7 వేలు చేశారు. దీని వల్ల ఇసుక కొనలేక జనం అవస్థలు పడుతున్నారు.
ఇసుక అందుబాటులో లేక 30 లక్షల కుటుంబాలు అర్దాకలితో అలమటిస్తున్నారు.ఇసుక మొత్తం జగనే తినేస్తున్నాడు.ఇసుక తిన్న జగనుకు.. అది ఎలా అరుగుతుందో అర్ధం కావడం లేదు..?శేఖర్‌రెడ్డి అనే బినామిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఇసుక రీచులన్నీ అతనికి కట్టబెట్టారు.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నాయకత్వంలో కుప్పంలో కొండలు , గుట్టలు అక్రమంగా తవ్వేశారు.పెద్దిరెడ్డి నియోజకవర్గమే కాకుండా, చిత్తూరు జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో గత కొంత కాలంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతున్నారు.ప్రకాశం జిల్లాలో గ్రానేట్ వ్యాపారాన్ని గంపగుత్తగా వైసీపీ నేతలు లాగేసుకొని వేబిల్స్ లేకుండా రాష్ట్రాలకు రాష్ట్రాలు తరలిస్తున్నారు.కోట్లాది రూపాయల మైనింగ్ డబ్బంతా సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తుంది.రాష్ట్రంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.భవిష్యత్తులో దీని కష్టాలు ప్రజలు అనుభవిస్తారు.గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఇనుప ఖనిజం ఏ విధంగా దోపిడి చేసి జైలుకు వెళ్లారు.నేడు నియోజకవర్గానికి ఒక గాలి జనార్దన్ రెడ్డి తయారయ్యారని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!