Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sansad Ratna Award 2023: ఢిల్లీలో సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డులు అందుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్.. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు వచ్చింది.. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్‌లో బాగా పనిచేస్తున్నారు.. ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు అని ప్రశంసించారు.. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను.. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారని తెలిపారు బండారు దత్తాత్రేయ.
ఇక, ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది.. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు.. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95శాతం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన.. ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందన్నారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
మరోవైపు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో గందరగోళం వల్ల బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు.. కానీ, స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు.. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు.. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉందన్నారు. పర్యాటక, సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.. ఇక, చార్టెడ్ అకౌంటెంట్, మేధావి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. కాగా, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలతో ప్రారంభించిన ప్రేమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఈ సంసాద్ రత్న అవార్డులను అందజేస్తోంది..
ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. pic.twitter.com/bTGDxBLwuC
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2023
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!