Sansad Ratna Award 2023: ఢిల్లీలో సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డులు అందుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్.. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు వచ్చింది.. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్‌లో బాగా పనిచేస్తున్నారు.. ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు…