MP Margani Bharat Ram: జగన్ పాలనపై అన్ని వర్గాలు పూర్తి సంతృప్తి.. ప్రజలకు ఏం కావాలో ఆయనకే తెలుసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat Ram: పేదల గుండె చప్పుడు, వారి హృదయంలో మాట, వారికేమి అవసరమో ఒక్క సీఎం వైఎస్ జగనన్నకే తెలుసునని, అందుకే ప్రజలంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి 38వ వార్డు సీతంపేట ఫారెస్ట్ కల్యాణ మండపంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిల్లి సుభాస్ చంద్రబోస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్, కరపత్రాలు, మొబైల్ ఫోన్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకూ జరగలేదన్నారు.
Read Also: Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ఇక, ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పాలన ఒక మహా యజ్ఞంలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని తెలిపారు ఎంపీ భరత్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినది మొదలు నేటి వరకూ ఈ నాలుగేళ్ళలో రూ.2లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా సొమ్ములు జమ చేసిన ఘనత జగనన్నదని అన్నారు. నాలుగు సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి చేస్తే, మరో ఐదు సంవత్సరాలు మళ్లీ సీఎంగా జగనన్నకే అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని మరింత సర్వతోముఖాభివృద్ధి చేస్తారన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకుని, వారి జీవన విధానంలో పెనుమార్పులు తీసుకు రావాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపన దిశగా జగన్ పాలన కొనసాగుతోందని, జగన్ పాలనపై అన్ని వర్గాల నుండి పూర్తి సంతృప్తి, హర్షం వ్యక్తమవుతోందని ఎంపీ భరత్ తెలిపారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో గృహసారథులు, కన్వీనర్లు ప్రతీ ఇంటికి వెళ్లి కనీసం 5 నిమిషాలు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. జగన్ పాలనపైనా, సంక్షేమ పథకాలు అమలుపైనా అయిదు ప్రశ్నలు అడిగి, రికార్డు చేసుకుంటారని చెప్పారు. గృహ యజమానుల అనుమతితో ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో కూడిన స్టిక్కర్ ఇంటి తలుపునకు అంటించడం, మొబైల్ కు స్టిక్కర్, అలాగే ఫోన్ ద్వారా సమాచారం పంపడం జరుగుతుందని వివరించారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!