తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టైన వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 వరకు అనంతబాబు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు కోర్టు సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నట్లు ఎస్సీ,ఎస్టీ కోర్టు వెల్లడించింది. అయితే ఇప్పటికే.. సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు అనంతబాబు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా… ఆయనను…
మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని సమాచారం. ఏదో విషయంపై ఇద్దరికి మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చెయ్యి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే.. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న ఖైదీలపై చిన్న గీత పడినా అక్కడి ఆసుపత్రిలో కారణం…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం భార్య అంగీకారంతో మృతదేహానికి పోస్టుమార్టంకు తరలించారు. దీంతో సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఎస్పీ, కలెక్టర్ హామీతో సుబ్రమణ్యం భార్య, కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో అర్థరాత్రి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్యకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని…