టెక్నాలజీ యుగంలో ప్రతీ చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో నచ్చిన యాప్‌లతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్‌లు ఉండాల్సింది.. అందులో మరీ ముఖ్యంగా వాట్సాప్ ఉంటేనే రోజు గడిచేది.. మెసేజ్ చేయాలన్నా.. వాయిస్ మెసేజ్ పెట్టాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా.. వాయిస్ కాల్ చేయాలన్నా.. చివరకు వీడియో కాల్ చేయాలన్నా.. ఇప్పుడు వాట్సాప్‌పై ఆధారపడిపోతున్నారు.. ప్రతీ యూజర్ ఈజీగా వాట్సాప్ వాడేస్తున్నారు.. అయితే, వాట్సాప్ వినియోగదారులారా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. కొన్ని పాత ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయడం నిలిచిపోనుంది.. అక్టోబరు నుంచి ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదని తాజా నివేదిక పేర్కొంది..
Read Also: Oke Oka Jeevitham Trailer: అమ్మ కోసం రెండు కాలాల్లో కొడుకు చేసిన ప్రయాణం
ఆపిల్ ఇటీవల ఇచ్చిన సమాచారం ప్రకారం.. కొన్ని పాత ఐఫోన్లలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పని చేయడం నిలిచిపోనుంది.. అక్టోబరు 24 నాటికి iOS 10, iOS 11 పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుంది.. ఈ మేరకు ఈ ఐవోఎస్‌లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోందట. అప్‌డేట్ చేసుకోవాలనేసమాచారాన్ని అందిస్తోంది. యూజర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్ ఉపయోగించడం కొనసాగించాలంటే, వారి ఐఫోన్‌లు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది.. ఐఫోన్ వినియోగదారులు iOS 12 లేదా ఆ తర్వాత వచ్చిన మోడల్స్ కలిగి ఉండాలని గతంలోనే వాట్సాప్.. తన హెల్ప్ సెంటర్ పేజీలో పేర్కొన్న విషయం తెలిసిందే.. అయితే ఈ సవరణ ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ అనే రెండు ఐఫోన్ వెర్షన్‌లను మాత్రమే ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.. అయితే, వెంటనే వాట్సాప్ వినియోగాన్ని కొనసాగించడానికి Android ఫోన్స్ వినియోగదారులకు Android 4.1 లేదా తదుపరి వెర్షన్ అవసరమని పేర్కొంది.
అయితే, ఐఫోన్‌ను తాజా iOS వెర్షన్‌కి ఎలా అప్‌డేట్ చేసుకోవాలని అనే విషయంలోనూ కీలక సూచనలు చేసింది వాట్సాప్.. iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్‌డేట్ కాకపోతే వెంటనే అప్‌డేట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు.. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.. ముఖ్యంగా, iOS 10 మరియు iOS 11 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లలో చాలా ఐఫోన్లు రన్ కావడం లేదు. కానీ, ఈ మార్పు ద్వారా ప్రభావితం అయ్యేది రెండు ఐఫోన్ మోడల్‌లు మాత్రమే.. ఒకటి ఐఫోన్ 5 అయితే.. మరొకటి ఐఫోన్ 5సీ.. మీ ఐఫోన్ పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లలో రన్ అవుతున్నట్లయితే, అప్‌డేట్ చేసుకకుంటే.. వాట్సాప్ సేవలు యథావిథిగా పొందే వీలుంటుందన్నమాట.