Minister Seediri Appalaraju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.. ఇక ఫైనల్‌గా ఎన్నికల బరిలో ఉన్నది ఎవరో తేలిపోయింది.. దీంతో.. అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ముందుంది.. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన వైసీపీ విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. స్థానిక సంస్దల ఎన్నికలలో ఇండిపెండెంట్ ముసుగులో టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారన్న ఆయన.. ప్రత్యర్ది టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి యాదవులు ముక్తకంఠంతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ఒక్క ఓటు పోకుండా అంతా గెలిపించాలని పిలుపునిచ్చారు.
Read Also: Undavalli Arun Kumar: ఏపీ విభజన కేసు.. ఇది శుభపరిణామం
ఇక, గ్రాడ్యుయేషన్ ప్రచారంలో కొన్ని ప్రశ్నలు ఎదురౌతున్నాయి.. సంక్షేమం మీద పెట్టిన దృష్ణి అభివృద్ది మీదపెట్టలేదని అడుగుతున్నారు… సచివాలయం , ఆర్బీకే, హెల్త్ సెంటర్ అన్నీ శాస్విత ప్రాతిపదికన కోట్లు ఖర్చు చేసి బాగుచేశామని తెలపాలన్నారు మంత్రి అప్పలరాజు.. దేశంలోనే విద్యకు ఎనలేని ప్రధాన్యత ఇస్తూ , నాడు నేడుకు కోట్ల రూపాయలు ఖర్చుచేశామన్న ఆయన.. విద్య , వైద్యం మాత్రమే అభివృద్ధి అన్నారు.. ఉద్యోగాలు ఇవ్వడం లేదంటున్నారు. ఒక్క సంతకంతో లక్షాయాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు.. అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది మన ప్రభుత్వమే అన్నారు.. పెట్టుబడులు రావడం లేదని అంటున్నారు..? అది అబద్ధమని కొట్టిపారేసిన ఆయన.. దేశంలో అత్యధిక పెట్టిబడులు వస్తున్నది మనరాష్ర్టానికే అని చెప్పుకొచ్చారు.. చంద్రబాబు హయాంలో చేసుకున్న ఒప్పందాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు.