Minister Roja: పవన్‌కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే..@ncbn వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడు.. చంద్రబాబు 11 మందిని చంపితే @PawanKalyan వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు.
వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!!Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2023
అటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు, పవన్ భేటీ అంశంపై స్పందించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ను చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటించగలడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని చంపితే దానిపై పవన్ కళ్యాణ్ సానుభూతి ఎందుకు చూపించలేదని నిలదీశారు. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్ధం అవుతుందని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడమే అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు, పవన్ కలిశారని విమర్శలు చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ పని చేస్తాడని, దమ్ముంటే 175 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు, టీడీపీతో సహజీవనం చేస్తుందని ఆరోపించారు. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడితో చంద్రబాబు కలుస్తున్నాడని.. పవన్ కళ్యాణ్‌కు ఒక అజెండా అంటూ లేదని మంత్రి వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు.
Read Also: Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?