Minister Roja Fires On Chandrababu Naidu TDP Manifesto: ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మోసానికి కేరాఫ్ చంద్రబాబు అని.. నమ్మక ద్రోహానికి ఫ్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబుకు ఇదే చివరి మేనిఫెస్టో, చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు. అసలు టీడీపీది మేనిఫెస్టో కాదని, మాయాఫెస్టో అని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన ఆరువందల హామీలను చంద్రబాబు గాలికి వదిలేశాడని దుయ్యబట్టిన ఆమె.. సీఎం జగన్ మాత్రం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశారని అన్నారు.
Loan App Harassment: అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు
ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటూ 30 మేనిఫెస్టోలు రిలీజ్ చేసినా.. ప్రజలు చంద్రబాబుని నమ్మరని మంత్రి రోజా పేర్కొన్నారు. డ్ర్వాక్రా మహిళలను రుణాల మాఫీ అంటూ బాబు మోసం చేశాడని.. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీడీపీ మేనిఫెస్టోలోని ఆరు హామీల్లో మూడు వైసీపీకి చెందినవని.. రెండు కర్నాటక కాంగ్రెస్ పార్టీవి, ఒకటి బీజేపీది చంద్రబాబు కాపీ కొట్టాడని ఆరోపించారు. మేనిఫెస్టోని కూడా సొంతంగా తయారు చేయలేని చంద్రబాబు.. సంపదను సృష్టిస్తానంటూ అబద్ధాలు చెప్తున్నాడని విరుచుకుపడ్డారు. ‘పూర్ టు రిచ్’ అంటే.. రెండు ఎకరాల నుండి వేలకోట్లు దోచుకొని సంపాదించుకోవడమా చంద్రబాబు? అంటూ ప్రశ్నించారు. పేద ప్రజలు ధనికులయ్యింది ఒక్క జగన్ ప్రభుత్వంలోనేనని మంత్రి రోజా ఉద్ఘాటించారు.
Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో ఘోరం.. విద్యుత్ షాక్తో ఆరుగురి మృతి
అంతకుముందు కూడా.. తూర్పో గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో టీడీపీ నిర్వహించిన మహానాడుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. అది మహానాడు కాదు మాయనాడు అని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ఓడిన లోకేశ్ ఫొటో వేసి, రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ ఫొటో ఎందుకు వేయలేదని ఆమె ప్రశ్నించారు. మహానాడులో ఎన్టీఆర్‌పై సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని, దాంతోపాటు ఆయనపై చెప్పులేసినందుకు క్షమాపణ కోరుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చంద్రబాబు చెప్పాలని కోరారు. కేవలం సీఎం జగన్‌ను తిట్టడానికే మహానాడు పెట్టినట్టు ఉందని అభిప్రాయపడ్డారు.